Petrol and Diesel Prices: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel Prices: పెట్రోల్‌‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంపు

Update: 2022-03-22 02:11 GMT

 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 

Petrol and Diesel Prices: ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యామా అని పెట్రోల్ ధరల పెంపు వైపు కేంద్రం కన్నెత్తి చూడలేదు. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ రేట్లను సవరించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కేంద్రం పెట్రోల్ ధరల పెంపు సాహసం చేయలేకపోయింది. అయితే చమురు సంస్థల్లో నష్టాలు పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పలేదు.

తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌ పై 88 పైసలు పెంచింది. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. కొద్ది నెలల ముందు ఇండియాలో చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 5రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించడంతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ్యాట్‌ను తగ్గించలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర 108 రూపాయల 20 పైసలుగా, డీజిల్ ధర 94 రూపాయల 52 పైసలుగా ఉంది.

Tags:    

Similar News