Revanth Reddy: కేసీఆర్, హరీష్‌రావు మహిళా హంతకులు.. మంత్రి హరీష్‌రావును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి
Revanth Reddy: ఇబ్రహీంపట్నం ఘటనను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకొని చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: కేసీఆర్, హరీష్‌రావు మహిళా హంతకులు.. మంత్రి హరీష్‌రావును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి
Revanth Reddy: ఇబ్రహీంపట్నం ఘటనను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకొని చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ ఆదేశించారు. హెల్త్ మినిస్టర్ హరీష్ రావును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మామ అల్లుళ్ళు మహిళా హంతకులు అంటూ కేసీఆర్, హరీష్‌రావును ఉద్దేశిస్తూ టీపీసీసీ చీఫ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చనిపోయిన మహిళా కుటుంబాలను హరీష్‌రావు పరామర్శించాలన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తూతూ మంత్రంగా అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్దని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నేషనల్ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.