Revanth Reddy: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
Revanth Reddy: బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
Revanth Reddy: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
Revanth Reddy: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిందన్న రేవంత్.. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఘటనలో ఏడుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు మరమ్మతులు ఏంటి..? రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.