Revanth Reddy: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొట్టమొదటి ట్వీట్
Revanth Reddy: అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశం
Revanth Reddy: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొట్టమొదటి ట్వీట్
Revanth Reddy: తెలంగాణ సీఎంగా అనుముల రేవంత్ రెడ్డిని ప్రకటించిన వెంటనే... సీఎం హోదాలో ఆయన తుఫాన్ హెచ్చరికలపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ పోస్టు చేశారు.. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జనజీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు.