Revanth Reddy: కాంగ్రెస్ వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు
Revanth Reddy: ఓటరన్న మేలుకో.. నిరుద్యోగిని కాపాడుకో అంటూ.. నిరుద్యోగులు బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నారు
Revanth Reddy: కాంగ్రెస్ వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న యువత, రైతులను చూసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు రావడం లేదని విమర్శించారు. అందుకే మీకు అండగా ఉండేందుకు వచ్చానని చెప్పారు.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పేరుతో కేసీఆర్ భూములు గుంజుకునే ప్రయత్నం చేశాడని విమర్శించారు. కామారెడ్డి ప్రజల భూములను కాపాడే బాధ్యత తనదే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూమిలేని పేదలకు ఏడాదికి 12వేలు ఇస్తామన్నారు.