Revanth Reddy: ప్రతి సబ్ స్టేషన్ దగ్గర రెఫరెండానికి రెడీ.. కేసీఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి

Revanth Reddy: తెలంగాణలో పవర్ వార్ కొనసాగుతోంది.

Update: 2023-07-15 13:30 GMT

Revanth Reddy: ప్రతి సబ్ స్టేషన్ దగ్గర రెఫరెండానికి రెడీ.. కేసీఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి

Revanth Reddy: తెలంగాణలో పవర్ వార్ కొనసాగుతోంది. వ్యవసాయ రంగానికి మూడు గంటలు ఉచిత విద్యుత్ చాలని రేవంత్ వ్యాఖ్యనించడంపై బీఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అయితే తన వ్యాఖ్యలను ఎడిట్ చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ అంశాలపై ప్రజల ముందుకు రెఫరెండానికి రావాలని మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. హరీశ్ రావు రెఫరెండం సవాల్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వీకరించారు. 3,500 సబ్ స్టేషన్‌లలో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ప్రతి సబ్ స్టేషన్ వద్ద రెఫరెండానికి సిద్ధమని చెప్పారు. కేసీఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి మగాళ్లని నిరూపించుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News