ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర వివాహరం

Update: 2020-08-14 05:51 GMT

Rats In RIMS Hospital Adilabad: ప్రాణాలు కాపాడే ఆలయం కారాగారంగా మారింది. వసతులు లేక వైద్యం, వైద్యం అందక రోగులు పారిపోతున్నారు. ఎకంగా ఐసోలేషన్ వార్డులలో ఎలుకలు స్వైర వివాహరం చేస్తున్నాయి. మాకోద్దు సర్కార్ దవఖాన అంటూ రోగులు పారిపోతున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో దిగజారుతున్నా ప్రమాణాలపై హెచ్ ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోజురోజుకు ప్రమాణాలు దిగజారుతున్నాయి. కరోనా చికిత్సం కోసం ఏర్పాటు చేసిన వార్డులో ఎలుకలు స్వైర విహరం చేస్తున్నాయి. ఆసుపత్రి బెడ్లపై ఎలుకలు సంచరిస్తూ రోగుల పైకి వస్తున్నాయి. రోగులు ప్రాణభయంతో వణుకుతున్నారు. రిమ్స్ లో వైద్యం తీరు నచ్చక రోగి పారిపోవడానికి ప్రయత్నించారు. ఐసోలేషన్ వార్డు నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత సిబ్బంది గుర్తించి రోగిని పట్టుకున్నారు. రిమ్స్ లో అందిస్తున్న వైద్యం వద్దని ఇంటికి పంపించాలని రోగి వేడుకున్నారు. చివరకు చేసేది ఏమి లేక పారిపోయిన రోగిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు.

అంతకు ముందు పది మంది పేషంట్లు రిమ్స్ ఆసుపత్రి నుంచి పారిపోయారు. రిమ్స్ లో డాక్టర్ల తీరు మారుతుందని అందరు అనుకున్నారు. అయిన మార్పు లేకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సరియైన వైద్యం అందించడంలేదని, డాక్టర్ల తీరు పై మండిపడుతున్నారు. కరోనా రోగుల ప్రాణాలతో చేలగాటం అడుతున్నారని మండిపడుతున్నారు. అంతే కాదు పేషంట్లకు సరియైన పోషక ఆహరం అందించడంలేదని మండిపడుతున్నారు. మరోవైపు డాక్టర్లు, రిమ్స్ డైర్టకర్ మద్య వార్ తారాస్థాయికి చేరింది. డాక్టర్ల నియమాకాలను వైద్యులు అడ్డుకుంటున్నారని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ అంటున్నారు. అందువల్లనే రోగులకు సరియైన వైద్యం అందడంలేదంటున్నారు. రిమ్స్ లో వైద్యుల తీరువల్ల రోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు . ఇప్పటికైనా సర్కార్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News