Mahabubabad: రైతుల సంక్షేమం కోసం యువకుడి సైకిల్ యాత్ర.. 12 జ్యోతిర్లింగాల లక్ష్యం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తిగలవేణి గ్రామానికి చెందిన బానోత్ నితిన్ రైతుల కోసం సైకిల్ యాత్ర చేపట్టారు. గూడూరు నుంచి 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ప్రయాణం.
Mahabubabad: రైతుల సంక్షేమం కోసం యువకుడి సైకిల్ యాత్ర.. 12 జ్యోతిర్లింగాల లక్ష్యం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తిగలవేణి గ్రామానికి చెందిన యువకుడు బానోత్ నితిన్ రైతుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రైతుల బాగుండాలనే లక్ష్యంతో సైకిల్ యాత్ర చేపట్టిన నితిన్, గూడూరు మండలం నుంచి దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనానికి సైకిల్‌పై ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు.
రైతు లేనిదే దేశం లేదని, దేశాభివృద్ధికి రైతులు కీలకమని నితిన్ పేర్కొన్నారు. రైతుల కష్టాలను సమాజానికి తెలియజేయడంతో పాటు, వారి సంక్షేమంపై అవగాహన కల్పించడమే ఈ సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రయాణం ప్రారంభించినట్లు చెప్పారు.
రైతుల కోసం చేపట్టిన ఈ యాత్రకు ప్రజలంతా సహకరించాలని, తన ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని నితిన్ విజ్ఞప్తి చేశారు. యువకుడి ఈ వినూత్న ఆలోచనకు గ్రామస్తులు, స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.