Karimnagar: రాజ్యాంగం రద్దుకు కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్‌పై బీఎస్పీ విమర్శలు

Karimnagar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నాయని బీఎస్పీ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం ఆరోపించారు.

Update: 2026-03-21 11:54 GMT

 Karimnagar: రాజ్యాంగం రద్దుకు కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్‌పై బీఎస్పీ విమర్శలు

కరీంనగర్: బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు భారతరాజ్యాంగంను రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నాయి అని బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రం లో జోన్ -1 స్థాయి ముఖ్య నాయకుల సమావేశం కి అయన ముఖ్య అతిథి గా హాజరై మహనీయుల చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులు అర్పించి, నాయకులనిద్దేశించి నిషాని రామచంద్రం మాట్లాడుతూ కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ రాజ్యాంగం ను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అది నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగం ను చేతిలో పట్టుకొని ప్రదర్శన చేయడం వల్ల ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. స్వతంత్రం వచ్చిన నుండి కాంగ్రెస్ రాజ్యాంగం ను అమలు చేయలేదన్నారు.

అంబేద్కర్ ని రాజ్యాంగ సభ కి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ కుట్ర చేసింది..

బాబాసాహెబ్ అంబేద్కర్ ని రాజ్యాంగ సభ కి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. ఒకవేళ రాజ్యాంగం రద్దు అయితే దేశం లో ఉన్న బహుజనులు శాశ్వత బానిసలూ అయ్యే ప్రమాదం ఉందన్నారు. బహుజన ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం రాజ్యాంగ పరిరక్షనే అని అన్నారు. మన హక్కులు రక్షించబడాలి అంటే మన రాజ్యాంగం రక్షించబడాలి, రాజ్యాంగం రక్షించబడాలి అంటే బహుజన ఉద్యమం బలంగా ఉండాలి బలోపేతం చేయాలి అన్నారు.

రాజ్యాంగ అమలు బీఎస్పీ తోనే సాధ్యంసాధ్యం..

రాజ్యాంగ రక్షణ కోసమే బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జీ మాయావతి సర్వస్వం త్యాగం చేసి పోరాటం చేస్తుందని అన్నారు. మాయావతి ప్రధాని అయితే తప్పా మనకు రక్షణ లేదన్నారు. కన్సీరామ్ ఆశయాలు బాబా సాహెబ్ రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు చేసేది మాయావతి తోనే సాధ్యమన్నారు. రాజ్యాధికారంలో 80 శాతం ఉన్న బహుజనులందరూ ఏకం కావలసిన ఆవశ్యకత ఉందన్నారు.

ఈ సమావేశం లో జోనల్ ఇంచార్జ్ లు ఎనగందుల వెంకన్న, దొడ్డే సమ్మయ్య, కళ్లేపల్లి రాజేందర్, నీరడి ఈశ్వర్, గైని గంగాధర్, దొడ్డే శ్రీనివాస్, నీరడి ఈశ్వర్, హరినాథ్, కోమిరే పోచేట్టి, సింగడే పాండు, హరి లాల్ నాయక్, మాతంగి మల్లయ్య, అనిల్, మంద బాలయ్య, గంగాధర్, అంబాల శతీష్, నిషాని రాజమల్లు బోయిని బాబు, వేల్పుల రాజు. ఆరెపల్లి వినోద్, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News