Top
logo

RIMS Director Sensational Comments : ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

RIMS Director Sensational Comments : ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
X
రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్
Highlights

RIMS Director Sensational Comments : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా బాధితులు ...

RIMS Director Sensational Comments : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా బాధితులు ఆదివారం ఆస్పత్రి నుంచి తప్పించుకొని పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ 10 మంది కరోనా పేషంట్లు ఆస్పత్రి నుంచి తప్పించుకుపోవడంపై మీడియా ఆదివారం రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బలరాం నాయక్ స్పందన కోరింది. దీంతో స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రిమ్స్‌ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులకు తాను లేఖలు రాశానని చెప్పారు. కానీ రిమ్స్‌లో వైద్య ఖాళీల భర్తీకి ఆ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులే అడ్డుపడుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ప్రస్తుతం పనివిధులు నిర్వహిస్తున్న వైద్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న వైద్యులే ఖాళీలు భర్తీ చేయడాన్ని ఒప్పుకోవడం లేదని, నా సీటు నా పోస్టు అంటూ తగువులాడుతున్నారని వ్యాఖ్యానించారు. రిక్రూట్‌మెంట్‌ విషయంలో రాజకీయాలు కూడా మొదలయ్యాయని ఆయన విమర్శించారు. స్థానిక రాజకీయ నాయకులు సైతం వైద్యులకే మద్దతు పలుకుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడున్న వైద్య సిబ్బంది తో తమ శాయశక్తులా పనిచేస్తున్నామని బలరామ్‌ నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తి చేసారు.


Web TitleRIMS Director Sensational Comments : Adilabad RIMS Director Sensational Comments on Corona Patients escape from Hospital
Next Story