హైదరాబాద్ పాతబస్తీలో పునుగుపిల్లి సంచారం

Hyderabad: దట్టమైన అడవుల్లో ఉండే పునుగుపిల్లి జనావాసాల్లో సంచారం

Update: 2023-07-23 01:45 GMT

హైదరాబాద్ పాతబస్తీలో పునుగుపిల్లి సంచారం

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అరుదైన పిల్లిజాతికి చెందిన పునుగుపిల్లి సంచారం... సంచలనం రేకెత్తించింది. దట్టమైన అడవుల్లో ఉండే పునుగుపిల్లి జనావాసాల్లో సంచరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. బహదూర్ పురా కిషన్ బాగ్ ప్రాంతంలో పునుగుపిల్లి సంచరిస్తూ జనం కంటపడింది. ఓ భవంతిని ఎక్కుతుండటాన్ని గుర్తించిన పరిసరవాసుల సుధీర్ఘంగా చర్చించుకున్ని అరుదైన పిల్లి సమాచారాన్ని జూ అ‎ధికారులకు అందించారు.

గంటపాటు శ్రమించిన జూ సిబ్బంది.. చాకచక్యంగా పునుగుపిల్లిని పట్టుకెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అరుదైన పునుగు పిల్లులను పెంచిపోషిస్తోంది. స్వామివారికి ప్రతివారం పునుగు గిన్నెసేవను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. పునుగుపిల్లినుంచి సేకరించిన తైలాన్ని శ్రీవారి విగ్రహానికి నివేదిస్తారు.  

Tags:    

Similar News