గోవుల అక్రమ తరలింపు పై సజ్జనార్ కు రాజాసింగ్ సవాల్.. అయిదురోజుల్లో ఆపకపోతే..
reprasentational image
సైబరాబాద్ సీపీ సజ్జనార్ రాజకీయ నేతలపై చేసే కామెంట్స్ సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పొలిటికల్ లీడర్స్ చేసే వ్యాఖ్యలు వాస్తవమా కాదా అని విచారించకముందే.. అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆవుల అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చినా స్పందించలేదని కొన్ని వాహనాలను పట్టుకున్నామని ప్రస్తుతం బహదూర్‌పురకు 30, 40 వాహనాల్లో ఆవులు, దూడలను తరలిస్తున్న పట్టించుకోవడంలేదని విమర్శించారు. కమిషనర్ వీటిని ఎలా ఆపుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఆవులను, దూడలను తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల తర్వాత తాను మళ్లీ రోడ్డు మీదకు వస్తానని ఎన్ని బండ్లు వచ్చిన ఆపేసి తెలంగాణ ప్రజల ముందు పెడతానన్నారు.