TS Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

TS Rains: తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసే అవకాశం

Update: 2022-10-17 02:34 GMT

TS Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

TS Rains: ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల3 రోజుల పాటు తెలంగాణలో, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా కోస్తాకు తుఫాన్‌ గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 18-20 తేదీల మధ్య అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఏర్పడనున్న అల్పపీడనం అనంతరం వాయుగుండంగా... తుఫాన్‌గా బలపడి ఈ నెల 22 తర్వాత కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న వాయుగుండం థాయ్‌లాండ్‌ మీదుగా ఈనెల 18 కల్లా ఉత్తర అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించి ఉపరితల ఆవర్తనంగా మారనుంది.

Tags:    

Similar News