Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం

Update: 2023-04-14 03:32 GMT

Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

Hyderabad: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌ నగరంలో వాతావరణమంతా మారింది. కూకట్‌పల్లి, అమీర్‌పేట, మూసాపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేటలో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో పొద్దంతా దంచికొట్టిన ఎండలు.. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు నమోదు అవుతున్నాయి. రాత్రికి పలుచోట్ల కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగింది. భాగ్యనగరాన్ని మబ్బులు కమ్మేయగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది.

Tags:    

Similar News