Rachakonda CP: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత
Rachakonda CP: గణేష్ నిమజ్జన విధుల్లో 6 వేలమంది పోలీస్ సిబ్బంది
Rachakonda CP: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత
Rachakonda CP: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. నిమజ్జనం ఏర్పాట్లు, రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. అన్ని చెరువుల వద్ద క్రేన్లు, పెద్ద విగ్రహాలను లిఫ్ట్ చేసేందుకు మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మద్యం సేవించి నిమజ్జనం కోసం రావొద్దని సూచించారు. ఉప్పల్, నేరేడ్‌మెంట్, నాగోల్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయన్నారు. గణేష్ నిమజ్జన విధుల్లో 6 వేలమంది పోలీస్ సిబ్బంది ఉంటారని సీపీ పేర్కొన్నారు.