Private Hospitals: కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం

Private Hospitals: కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం * కరోనా వైద్యానికి వస్తే గాల్లోకి ప్రాణాలు

Update: 2021-05-05 08:30 GMT

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం (ఫైల్ ఇమేజ్)

Private Hospitals: ఒక పక్కన కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడిపోతుంటే.. మరొపక్కన శవాలపై పేలాలు ఏరుతున్నారు ప్రైవేట్ ఆస్పత్రులు. కొవిడ్ చికిత్స పేరుతో ప్రభుత్వ నిబంధనలను పక్కన పడేసి లక్షలాది రూపాయాలను వసూలు చేస్తున్నారు. అయినా. ప్రాణాలు దక్కుతాయన్న గ్యారెంటీ లేదు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రిలో చేరితే.. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ, డబ్బులపై ఉన్న శ్రద్ధ పేషెంట్‌పై లేకుండా పోతుంది. దాంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మదీనాగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి బాగోతం బయటపడింది. మదీనాగూడకు చెందిన శంకర్ పవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఏప్రిల్ 19 మదీనాగూడలోని అర్చన హాస్పిటల్‌లో జాయిన చేయించాడు ఆయన కొడుకు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన తండ్రి మే 4న మరణించాడ అని కొడుకు ఆవేదన చెందుతున్నాడు.ఐసీయూలో ఉన్నా కనీసం పట్టించుకోకపోవడంతో తన కళ్లముందే ప్రాణాలను వదిలాడని ఆవేదన చెందుతున్నాడు. ఆక్సిజన్, పల్స్ చూడలేదని.. డబ్బుల వసూలుపై ఉన్న ధ్యాస పేషెంట్ మీద పెట్టలేదని ఆవేదన చెందాడు. కరోనా ట్రీట్‌మెంట్ ఇప్పటికే పది లక్షల రూపాయాలను ఆస్పత్రికి చెల్లించినట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. 

Full View


Tags:    

Similar News