President: తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

President: ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాష్ట్రపతి ముర్ము

Update: 2023-12-23 05:48 GMT

President: తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

President: తెలంగాణలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప‌ర్య‌ట‌న ముగిసింది. శీతాకాల విడిది నిమిత్తం ఈనెల 18న రాష్ట్రానికి వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి, తెలంగాణలో జరిగిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంప‌ల్లిని సంద‌ర్శించారు. బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఎట్‌ హోం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇవాళ ఉద‌యం హ‌కీంపేట్‌లో రాష్ట్ర‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉన్నతాధికారులు వీడ్కోలు ప‌లికారు. అనంత‌రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్ర‌త్యేక విమానంలో ఆమె ఢిల్లీ బ‌య‌ల్దేరారు.

Tags:    

Similar News