Kumuram Bheem District: వాగు ఉధృతంగా ప్రవహించడంతో.. గర్భిణిని చేతులపై మోస్తూ ఒడ్డుకు చేర్చిన యువకులు
Kumuram Bheem District: బ్రిడ్జ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న గ్రామస్తులు
Kumuram Bheem District: వాగు ఉధృతంగా ప్రవహించడంతో.. గర్భిణిని చేతులపై మోస్తూ ఒడ్డుకు చేర్చిన యువకులు
Kumuram Bheem District: కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కరంజివాడ గ్రామంలో బోరిలాల్ గూడ నుంచి ఆదిలాబాద్ రావాలంటే.. అనార్‌పల్లివాగు దాటాలి. ఈ గ్రామానికి చెందిన జాదవ్ అశ్విని ఏడు నెలల గర్భిణి నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా ఆమెను ఆదిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులో ప్రవాహం పెరగడంతో వాయిదా వేస్తూ వచ్చారు వరద కొంచెం తగ్గడంతో గర్భిణిని చేతులపై మోస్తూ ఇలా ఒడ్డుకు చేర్చారు. వర్షకాలంలో వాగు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.