గణేష్ నిమజ్జనం నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా.. పాతబస్తీ ముస్లిం మతపెద్దలు
Hyderabad: మిలాద్-ఉన్-నబీ వాయిదాకు సై కొట్టిన పీస్ కమిటీ సభ్యులు
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా.. పాతబస్తీ ముస్లిం మతపెద్దలు
Hyderabad: పాతబస్తీ మతపెద్దలు మిలాద్ ఉన్ నబీపై తమ నిర్ణయాన్ని తీసుకున్నారు. గణేష్ నిమజ్జంన నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీని వాయిదా వెయ్యాలనే నిర్ణయంపై ఎకతాటిపైకి వచ్చారు. రెండు వర్గాల మత పెద్దలతో 300మంది సభ్యులతో పోలీసులు పీస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు మిలాద్-ఉన్-నబీ వాయిదాకు సై అన్నారు. ఒకే రోజు గణేష్ నిమజ్జనంతో పాటు మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి. దీంతో అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించాలని మతపెద్దలు నిర్ణయించారు. సెప్టెంబర్ 28వ తేదీన గణేష్ నిమజ్జనం జరగనుంది. భక్తులు 3, 6, 9వ రోజుల్లో గణేష్ నిమజ్జనం చేసుకోవాలని పోలీసులు సూచించారు.