Ponnam Prabhakar: వెయ్యిరూపాయల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం
Ponnam Prabhakar: ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నాం
Ponnam Prabhakar: వెయ్యిరూపాయల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం
Ponnam Prabhakar: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ధరంకరం రోడ్డులో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు మంత్రి.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెయ్యి రూపాయల విలువైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని.. అనవసరమైన విమర్శలు చేయొద్దని మంత్రి కోరారు.