Kishan Reddy: సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైంది.. కేసీఆర్‌కు ఎన్నికల సమయంలో మాత్రమే..

Kishan Reddy: తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Update: 2023-04-19 11:09 GMT

Kishan Reddy: సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైంది.. కేసీఆర్‌కు ఎన్నికల సమయంలో మాత్రమే..

Kishan Reddy: తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంతర్గత ప్రైవేటీకరణ మొదలుకొని.. అవుట్ సోర్సింగ్, ఆర్థిక లావాదేవీల వరకు..అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం షరా మామూలుగా మారిపోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు..సింగరేణి కార్మికులు ఎన్నికల సమయం లో మాత్రమే గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సింగరేణిని విస్తరిస్తామన్న కేసీఆర్.. కనీసం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయలేకపోయారని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి.

Tags:    

Similar News