వరంగల్‌ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో... టీఆర్ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి గెలుపు

Update: 2019-06-03 14:53 GMT

వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకున్నారు. ఉప ఎన్నికలో మొత్తం 883 ఓట్లు పోల్‌ కాగా... 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్‌కు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామిరెడ్డికి కేవలం 23 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ గెలుపు కేసీఆర్‌, కేటీఆర్‌, వరంగల్‌ ప్రజాప్రతినిధులది అన్నారు  పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.

ఫలితాల అనంతరం HMTV తో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గెలుపు కేసీఆర్, కేటీఆర్ . వరంగల్ ప్రజాప్రతినిధులది. వరంగల్ ప్రజలకు ఋణపడి ఉంటాను అన్నారు.  స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడుతనని తెలిపారు. తన గెలుపు కోసం  కృషి చేసిన ఎమ్మెల్యేలు, మంత్రికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేశాననీ, ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తాననీ ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తనకు ఓటు వేశారన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయనీ,జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు తనకు ఓటు వేశారాణీ చెప్పారు. 

Tags:    

Similar News