PM Modi: ఇవాళ వరంగల్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ..

PM Modi: ఇవాళ వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

Update: 2023-07-08 01:35 GMT

PM Modi: ఇవాళ వరంగల్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ..

PM Modi: ఇవాళ వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వరంగల్ మూమునూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకు‌ని అటునుంచి నేరుగా ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోదీ భద్రకాళి దేవాలయాన్ని చేరుకుంటారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి గ్రౌండ్స్ కు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే వ్యాగన్ల ఉత్పత్తి పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అలాగే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో తెలంగాణ బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. ఈ సందర్భంగా మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి మామునూరుకు చేరుకుని రాజస్థా‌న్ బయలుదేరుతారు.

Tags:    

Similar News