నిజామాబాద్‌లో రెండు గంటలు.. ప్రధాని మోడీ నిజామాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు..!

PM Modi Telangana Tour: ప్రధాని మోడీ.. నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2023-09-30 10:54 GMT

నిజామాబాద్‌లో రెండు గంటలు.. ప్రధాని మోడీ నిజామాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు..!

PM Modi Telangana Tour: ప్రధాని మోడీ.. నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 3న నిజామాబాద్‌‌లో పర్యటించనున్న మోడీ... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆయా శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ​శాంతికుమారి ఆదేశించారు. అలాగే గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బీజేపీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎంపీ ధర్మపురి అర్వింద్.

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటల పాటు ప్రధాని పర్యటన ఉండనుంది. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల కోసం రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం ఒక వేదిక సిద్ధం చేస్తున్నారు. 800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును ఇందూరు నుంచి జాతికి అంకితం చేస్తారు.

మధ్యాహ్నం 2:10 - బీదర్‌ విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్‌లో ప్రయాణం

2:55 - కొత్త కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్‌లో చేరుకొనున్న ప్రధాని

3:00-3:40 - వరకు అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవాలు

3:45-4:45 -అధికారిక వేదిక నుంచి పక్కనే బీజేపీ బహిరంగసభ కు హాజరు

4:50-5:00 - కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకోనున్న ప్రధానమంత్రి

5:00-5:45 - నిజామాబాద్‌ నుంచి బీదర్‌ విమానాశ్రయానికి ప్రయాణం

Tags:    

Similar News