పవన్ పర్యటనలో అపశ్రుతి.. యువకుడి దుర్మరణం.. ముగ్గురికి గాయాలు..
Pawan Kalyan: పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది.
పవన్ పర్యటనలో అపశ్రుతి.. యువకుడి దుర్మరణం.. ముగ్గురికి గాయాలు..
Pawan Kalyan: పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ధర్మపురిలో పూజల అనంతరం పవన్ కల్యాణ్ వాహనశ్రేణి మంగళవారం రాత్రి ఏడో నెంబరు రాష్ట్ర రహదారిపై వెళ్తుండగా.. పవన్ అభిమానులైన కూస రాజ్‌కుమార్ (20), జక్కుల అంజి బైక్‌పై అనుసరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్‌రావుపేట వద్ద అత్యుత్సాహంతో పవన్ వాహన శ్రేణిని అధిగమించబోయి.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని, కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కూస రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, జక్కుల అంజి, శ్రీనివాస్, సాగర్ కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.