హోంమంత్రి మనవడిపై ఆరోపణలు అవాస్తవం- డీసీపీ

నిందితులు మైనర్లు కావడంతో చట్టప్రకారం చర్యలు- డీసీపీ

Update: 2022-06-04 03:15 GMT

హోంమంత్రి మనవడిపై ఆరోపణలు అవాస్తవం- డీసీపీ

Amnesia Pub Case: హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో హోంమంత్రి మనవడు ఉన్నాడన్న కోణంలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్. సీసీటీవీ ఫుటేజీలో హోం మంత్రి మనవడు ఎక్కడా కనిపించలేదని డీసీపీ తెలిపారు. మే నెల 28న గ్యాంగ్ రేప్ జరిగితే మే 31న బాధితురాలి తండ్రి వచ్చి తమకు ఫిర్యాదు చేశారని డీసీపీ చెప్పారు. గ్యాంగ్ రేప్ కారణంగా బాలిక రెండు రోజుల పాటు షాక్ లో ఉందని, ఈ కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారన్నారు. దీంతో బాలికకు మహిళా కానిస్టేబుళ్లతో కౌన్సిలింగ్ ఇప్పించామని ఆయన తెలిపారు.

ఆ తర్వాత బాధితురాలిని విచారించగా తనపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లుగా చెప్పిందన్నారు. అయితే వారిలో ఒక్కరి పేరు మాత్రమే బాలిక చెప్పగలిగిందన్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను గుర్తించామని డీసీపీ తెలిపారు. వారిలో ఇద్దరు మేజర్లు కాగా, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరో మైనర్ నిందితుడిని అతడి కుటుంబ సభ్యుల కస్టడీలోనే ఉంచామని తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులను 48 గంటల్లోగా అదుపులోకి తీసుకుంటామని డీసీపీ చెప్పారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవని ఆయన తెలిపారు.

Full View


Tags:    

Similar News