నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

జిల్లా పోలీసు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

Update: 2020-01-01 11:14 GMT
జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు

నిర్మల్: జిల్లా పోలీసు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు ఎస్పీ క్యాంపు, జిల్లా సాయుధ దళా కార్యాలయంలో కేక్ కట్ చేసి జిల్లా పోలీస్ అధికారుల మధ్య నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గడచిన 2019 సంవత్సరం మొత్తం ఎన్నికలకు, పోలీసు బందోబస్తులకు పెట్టింది పేరుగా అభివర్ణించారు.

ఎన్నికల సమయంలో నిర్మల్ జిల్లా ప్రజల సహాయ సహకారాలు ఎప్పటికీ మరువలేని అని కొనియాడారు. అయితే గత సంవత్సరం నేరాలు కూడా దాదాపు అదుపులోకి వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో కూడా నిర్మల్ జిల్లా ప్రజల నుండి అదే మాదిరి సహాయ సహకారాలు ఉండాలని, నేరాల నియంత్రణలో ప్రజలు సైతం పాలుపంచుకుంటూ పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఈ సమాజంలో మహిళల రక్షణ పై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై అందరూ దృష్టి సారించి జిల్లాను నేర రహిత జిల్లాగా రూపొందించేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, ఎఆర్ అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి.వెంకటేష్, సి.ఐ.లు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, జైరాం నాయక్, వేణుగోపాల్ రావు, ప్రవీణ్ కుమార్, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏ.ఆర్. ఇన్స్పెక్టర్ వెంకటి, ఎస్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News