రోహిత్ వేముల కేసు: విద్యార్థుల ఆందోళనతో కేసును రీఓపెన్ చేసిన పోలీసులు...

Rohith Vemula: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-05-04 06:02 GMT

HCU: రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు..

Rohith Vemula: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని శుక్రవారం పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు రాగా.. ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు. అంతేగాక, రోహిత్ దళితుడు కాదని పేర్కొన్నారు.

రోహిత్ ఆత్మహత్యకు అప్పటి హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక, రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు.

అయితే, రోహిత్ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్ చేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో కేసును మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు. ఈ క్రమంలోనే కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర పోలీసు శాఖ పిటిషన్ దాఖలు చేసింది.

Tags:    

Similar News