నల్లగొండ మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఓట్ల లెక్కింపుకు మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి. మూడంచెల భద్రతతో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.
నల్లగొండ మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి మూడు వేర్వేరు ప్రాంతాల్లో లెక్కింపు ప్రక్రియ జరగనుంది.నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల కోసం అర్జాలబావి దగ్గర ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోడౌన్స్‌లో పటిష్ట ఏర్పాట్లు చేశారు.చిట్యాల, దేవరకొండ, చండూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీలో నిర్వహించనున్నారు.ఇక హాలియా, నందికొండతో పాటు మిర్యాలగూడ మున్సిపాలిటీల కౌంటింగ్ కోసం అవంతిపురం మార్కెట్ యార్డును సిద్ధం చేశారు అధికారులు.కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో, అధికారుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు.రేపు ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది అంటున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ చంద్రశేఖర్ తో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్.