Karimnagar: సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకరం: చొప్పదండి ఎమ్మెల్యే ఆవేదన!
Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు కాంగ్రెస్ సీనియర్ నేత యూనిస్ గారి మరణం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం దిగ్భ్రాంతి!
Karimnagar: సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకరం: చొప్పదండి ఎమ్మెల్యే ఆవేదన!
కరీంనగర్ జిల్లా: రామడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యూనిస్ మరణం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామడుగు గ్రామ సర్పంచ్ ఎండీ మోయిజ్, ఎండీ అనిష్‌ల తండ్రి అయిన యూనిస్ మరణవార్త తెలిసిన వెంటనే పలువురు ప్రజాప్రతినిధులు వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం యూనిస్ గారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. యూనిస్ గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి లోటు తీరనిదని అన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, వెంకటరామిరెడ్డి, అంజనీప్రసాద్, నేరెళ్ల కవిత రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూనిస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు.