Peddapalli: మెరుగైన వైద్యం అందించండి.. వైద్యులకు జడ్జి సుధారాణి ఆదేశం
Peddapalli: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంథని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సివిల్ కోర్టు జడ్జి ఎ. సుధారాణి. రోగుల పరిస్థితి, మందుల లభ్యతపై ఆరా.
Peddapalli: మెరుగైన వైద్యం అందించండి.. వైద్యులకు జడ్జి సుధారాణి ఆదేశం
Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సివిల్ కోర్ట్ జడ్జి ఎ. సుధారాణి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది, అలాగే పేషంట్ల పరిస్థితిని పరిశీలించి, అందుబాటులో ఉన్న మందుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పేషంట్లకు పండ్లు పంపిణీ చేసి, వారికి ధైర్యం చెప్పారు. జడ్జి వెంబడి పీపీ ఆంజనేయులు, న్యాయవాదులు రఘోత్తం రెడ్డి, శశి భూషణ్ కాచే, షబానా, లక్ష్మి, విజయకుమార్ ఉన్నారు.