Karimnagar: ఆరోగ్యమే మహాభాగ్యం పర్యావరణం కోసం తొక్కండి సైకిల్!
Karimnagar: కరీంనగర్ పోలీస్ గ్రౌండ్స్ నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారీ సైకిల్ ర్యాలీ.
Karimnagar: ఆరోగ్యమే మహాభాగ్యం పర్యావరణం కోసం తొక్కండి సైకిల్!
కరీంనగర్: సైక్లింగ్ చేయడం వలన చాలా లాభాలు ఉంటాయని మరియు ఆరోగ్యంగా ఉండగలుగుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డాక్టర్ వి.నరేందర్ రెడ్డి , గౌస్ ఆలాం, ఐపీఎస్ , కమిషనర్ ఆఫ్ పోలీస్, డాక్టర్ బంగారి స్వామి , చైర్మన్, రేని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ కెప్టెన్ బి. మధుసూదన్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులతో కలిసి స్థానిక కరీంనగర్ లోని పోలీస్ పోలీస్ గ్రౌండ్ నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సైకిల్ ర్యాలీ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వలన అనేక లాభాలను ఉంటాయని కావున ప్రతి ఒక్కరు సైక్లింగ్ చేయడం అలవాటుగా చేసుకోవాలని మరియు పర్యవరణాన్ని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ ట్రాఫిక్ సీఐ, ఎస్.హనుమంత్ , ఎస్సై ఆఫ్ పోలీస్, డాక్టర్ రమణరెడ్డి , సురభి వేణుగోపాల్ , మహేందర్ , రమేష్ , అరవింద్ తదితరులు పాల్గొన్నారు.