Mahabubabad: ప్రేమ తెచ్చిన తంటా.. పలువురి పై కేసు నమోదు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో దారుణం. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో గడ్డివాముకు నిప్పు పెట్టి, రూ. 7 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు.
Mahabubabad: ప్రేమ తెచ్చిన తంటా.. పలువురి పై కేసు నమోదు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ శివారు వాగ్య తండా H/o గుండెంగా గ్రామానికి చెందిన తేజావత్ ఉమ్లా తండ్రి మంజ్య గారు తేదీ 06.04.2026 న ఉదయం సమయంలో ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన సమయంలో, కొంతమంది వ్యక్తులు ఇంటి ముందు వచ్చి ప్రేమ విషయంలో నిరసన వ్యక్తం చేసినారు.
అనంతరం తేదీ 07.04.2026 న తెల్లవారుజామున సుమారు 04.00 గంటల ప్రాంతంలో తెలియని వ్యక్తులు గడ్డివాము కు నిప్పు పెట్టి, ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు రూ.7,00,000/- మరియు బంగారు చైన్‌ను అపహరించినారు.
గడ్డివాము దహనం వల్ల సుమారు రూ.10,000/- నష్టం జరగగ, ఇట్టి సంఘటన పై తేజావత్ ఉమ్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించబడుతోంది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ బి. గిరిధర్ రెడ్డి తెలిపారు.