Sultanabad: కోర్టులో హెల్త్ క్యాంప్.. ఆరోగ్య సూత్రాలు తెలిపిన జడ్జి!

Sultanabad: సుల్తానాబాద్ కోర్టులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

Update: 2026-04-07 10:55 GMT

Sultanabad: కోర్టులో హెల్త్ క్యాంప్.. ఆరోగ్య సూత్రాలు తెలిపిన జడ్జి!

Sultanabad: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రతిమ ఫౌండేషన్ చే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ను జడ్జి గణేష్ ప్రారంభించారు. ప్రతిమ హాస్పిటల్ వైద్యులు న్యాయవాదులకు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బందికి, కక్షిదారులు తో పాటు సుమారు 150 మందికి బి.పి., షుగర్, ఇసీజీ, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని, ఆకు కూరలు, మిటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. రైస్ మిల్లుల ద్వారా వచ్చే కాలుష్యంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వయసు మీరిన వారికి మితాహారం శ్రేయస్కరం అని అన్నారు. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్ , ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఆవుల శివకృష్ణ, ఏపీపీ శ్యామ్ ప్రసాద్ రావు, ఏజీపీ దూడం ఆంజనేయులు, ప్రతిమ సీఈవో సి. రాంచందర్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి యన్ ప్రసాద్, హెల్త్ క్యాంప్ ఇంచార్జ్ కౌశిక్ , ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ గీతా రెడ్డి, న్యాయవాదులు ఆవుల లక్ష్మి రాజం, పడాల శ్రీరాములు బోయిని భూమయ్య పడాల అంజయ్య, జోగుల రమేష్, సామల రాజేంద్రప్రసాద్ , వడ్లకొండ రవికిరణ్, మల్యాల కరుణాకర్, ఆర్. నర్సయ్య, వేముల స్నేహ, మాడూరి పృథ్వీ, లెక్కల గంగాధర్ లతో పాటు ప్రతిమ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News