BVRIT: ఈటి ఉత్సవ్ సందడి.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల కొలువు!

BVRIT: బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT)లో ఘనంగా ముగిసిన ఈటి ఉత్సవ్-2026 అంతర్జాతీయ సదస్సు.

Update: 2026-04-07 10:46 GMT

BVRIT: ఈటి ఉత్సవ్ సందడి.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల కొలువు!

BVRIT: బి వి రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT)లో జరుగుతున్న “సస్టైనబిలిటీ మరియు ఆటోనమస్ వాహనాల కోసం యుటిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై అంతర్జాతీయ సదస్సు (ETUTSAV–2026)” రెండవ రోజు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో అకాడమిషియన్లు, పరిశోధకులు మరియు పరిశ్రమ నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డా. రూపేష్ గణపత్రావ్ వాంధరే అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్ హాజరైనారు. వారు సదస్సు లో మొదటి ప్రసంగాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ “ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే పవర్ కన్వర్టర్లు” అనే అంశంపై ప్రసంగిస్తూ EV పవర్ ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన పురోగతులను వివరించారు.

ఈ రోజు సదస్సులో మరో విశిష్ట అతిథిగా జపాన్‌ దేశానికి చెందిన డాక్టర్. షూఇచి టోరి, ప్రొఫెసర్, కురుమే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి, జపాన్‌ . వారు సదస్సు లో రెండవ ప్రసంగాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ “ఫోటోవోల్టాయిక్స్ మరియు లిథియం బ్యాటరీల్లో ఉపయోగించే విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థల లక్షణాలు, పునరుత్పాదక శక్తి సమీకరణ మరియు నిల్వ సాంకేతికతల” ప్రాధాన్యతను వివరించారు.

ఈ రోజు సదస్సులో మరో విశిష్ట అతిథిగా ఇండోనేషియా దేశంలోని యూనివర్సిటీస్ సమ్ రతులాంగి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సలాకి రేనాల్డో జోషువా, వారు మాట్లాడుతూ “స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్స్‌లో ఎనర్జీ ఫోరకాస్టింగ్ కోసం కంప్యూటర్ విజన్ మరియు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కలిపిన హైబ్రిడ్ AI విధానాలు” అనే అంశంపై ప్రసంగించారు

అంతర్జాతీయ సదస్సు చైర్మన్ డా. కాటూరి రాయుడు సదస్సు లో మాట్లాడుతూ చీఫ్ ప్యాట్రన్ శ్రీ కె. వి. విష్ణు రాజు, ప్యాట్రన్స్ శ్రీ రవిచంద్రన్ రాజగోపాల్ మరియు శ్రీ కె. ఆదిత్య విశ్సం, గారి తోడ్పాటు ప్రోత్సాహం వల్ల సదస్సు విజయవంతంగా నిర్వహించడానికి ఎంతో దోహదం చేసిందని తెలియపరిచారు

ఈ సదస్సులో బీవీఆర్ఐటీ కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపల్ డా. సంజయ్ దూబే, ఇండస్ట్రీ రిలేషన్ షిప్ ప్లేసెమెంట్ డీన్ డా. జె. బంగారాజు మరియు శ్రీ ఎన్. రామచందర్., కన్వీనర్ డా. పి. చంద్రబాబు, కో-కన్వీనర్లు డా. జి. నరేష్ కుమార్ మరియు శ్రీ ఎ. మురళి, కాన్ఫరెన్స్ కో-చైర్ డా. సి. సుబ్బరామిరెడ్డి ముఖ్య పాత్ర పోషించారు

ఈ కార్యక్రమంలో వివిధ కళాశాల అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, ఇండస్ట్రీ , కార్పొరేట్ విభాగాల వారు పాల్గొన్నారు. అన్ని విభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కళాశాల మేనేజర్ శ్రీ బి. బాపి రాజు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ టి.ఎల్.ఎన్. సురేష్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.

ఈ సదస్సు విజయవంతంగా నిర్వహించడంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF), అవ్ఘ్ని సోలార్, రెట్రాన్ ఎనర్జీస్, మోనోఫ్రంట్ సోలార్, హైటెక్ సంస్థలు వంటి స్పాన్సర్లు మరియు భాగస్వాములు అందించిన సహకారానికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్, డా. సంజయ్ దూబే.

Tags:    

Similar News