Revanth Reddy: రేవంత్ రెడ్డి వర్సెస్ పినరయి విజయన్.. కేరళ సీఎంకు రేవంత్ 6 పేజీల ఘాటు లేఖ!

Revanth Reddy: కేరళం సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందిం చారు.

Update: 2026-04-07 09:09 GMT

Revanth Reddy: రేవంత్ రెడ్డి వర్సెస్ పినరయి విజయన్.. కేరళ సీఎంకు రేవంత్ 6 పేజీల ఘాటు లేఖ!

Revanth Reddy: కేరళం సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందిం చారు. అసంబద్ధ ఆరోపణలని ఖండిస్తూ..అధికారిక గణాంకాలతో కౌంటర్ ఇచ్చారు. ఆరు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేసిన సిఎం రేవంత్ బహిరంగ చర్చకు సిద్దం అని సవాల్ విసిరారు.

కేరళం అభివృద్ధి మోడల్‌పై పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. కేరళ అభివృద్ధి ఒక్క LDF ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ కృషి కాదని… గత 60 ఏళ్ల సమిష్టి కృషి ఫలితమని స్పష్టం చేశారు. తెలంగాణపై చేసిన ఆరోపణలు 2023-24 గణాంకాల ఆధారంగా ఉన్నాయని… అవి బీఆర్ఎస్ పాలన చివరి దశకు చెందినవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 28 నెలలే అయినప్పటికీ… సమగ్ర అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు.పేదరికం, అక్షరాస్యత అంశాల్లో కేరళతో పోలిక సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. కేరళం అభివృద్ధికి దశాబ్దాల చరిత్ర, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన నిధులు కారణమని వివరించారు.

తెలంగాణ మాత్రం తక్కువ కాలంలోనే అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని చెప్పారు. శిశు మరణాల రేటు అంశంలో కూడా పోలికలు తారుమారుగా చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆరోగ్య రంగంలో భారీ మెరుగుదల సాధించామని… రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. కేరళంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు, శబరిమల వివాదాలపై విజ‌యన్ సర్కార్ వైఖరిని ప్రశ్నించారు. బీజేపీతో LDF గోప్య సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో 28 నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. బీసీలకు 41శాతం రిజర్వేషన్లు, కుల గణన, ఇందిరమ్మ ఇళ్లు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని చెప్పారు.

తిరువనంతపురంలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి… పినరయి విజయన్‌కు ఆహ్వానం ఇచ్చారు. వాస్తవాల ఆధారంగా గౌరవప్రద చర్చ జరపాలని పిలుపునిచ్చారు. కేరళం-తెలంగాణ మధ్య అభివృద్ధి మోడళ్లపై రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది.ఈ లేఖతో రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి… ఇక విజ‌యన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News