Choppadandi: ఆపదలో ఆదుకున్న సర్కార్.. లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు
Choppadandi: చొప్పదండి మండలంలో 46 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ.
Choppadandi: ఆపదలో ఆదుకున్న సర్కార్.. లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 46 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ పథకం ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నదని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నిజానాపురం చందు, మునిసిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరితా-శ్రీనివాస్, వైస్ చైర్‌పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య గౌడ్ పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్లు ముద్దం రాజేశ్వరి, తిరుపతి గౌడ్, గుర్రం రాజేందర్ రెడ్డి, సుజిత్ రెడ్డి, పిట్టల వెంకటేశ్, ఓలుగోతుల సురేష్, కనుమల్ల రాజశేఖర్ కొలిమికుంట సర్పంచ్ చొక్కాల తిరుపతి మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సహాయం తమకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.