Dubbak: పార్టీలకు అతీతంగా స్తూపం నిర్మిద్దాం.. అధికారులకు విన్నపం

Dubbak: దుబ్బాకలో అమరవీరుల స్తూపం ఏర్పాటు కోసం అధికారులకు వినతి పత్రం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా స్తూప నిర్మాణం జరగాలని కీసరి స్వామి, బాల్ రెడ్డి డిమాండ్.

Update: 2026-04-07 09:37 GMT

Dubbak: పార్టీలకు అతీతంగా స్తూపం నిర్మిద్దాం.. అధికారులకు విన్నపం

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక కమిషనర్ కు మరియు దుబ్బాక చైర్మెన్ కు అమర వీరుల స్థూపం ఏర్పాటు స్థలం కోసం వినతి పత్రము అందచేసిన కీసరీ స్వామి మరియు బాల్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం లో దుబ్బాక నుండి మొదలైన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రానికే పేరు వచ్చే విధంగా ఉద్యమ సమయంలో కూడా అన్ని పార్టీల యువకులు అన్ని కులస్తుల యువకులు కలసికట్టుగా తెలంగాణ రాష్ట్రం కోసం నిరసన తెలిపినారు

అందుకే మన దుబ్బాకలో అమరులకు చిహ్నంగా మంచి అమరవీరుల స్థూపాన్ని అన్ని పార్టీల కతీతంగా నిర్మించుకుందాం అని అన్నారు అదే విధంగా దుబ్బాక టౌన్ లో అమరవీరుల స్థూపం స్థలం కేటాయింపు కొరకు అధికారులు త్వరగా కృషి చెయ్యాలి అని కీసరీ స్వామి అన్నారు. బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల శృతిని చిరస్థాయిగా నిలబెట్టడం మన బాధ్యత అన్నారు.

Tags:    

Similar News