Karimnagar: ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ కార్లా? నిలదీసిన సిఐటియు

Karimnagar: కరీంనగర్‌లో వైట్ ప్లేట్ కార్ల అక్రమ దందాపై సిఐటియు నిరసన. టాక్సీ డ్రైవర్ల నష్టం, రవాణా శాఖకు వస్తున్న నష్టంపై కార్మిక సంఘాల ఆగ్రహం.

Update: 2026-04-07 08:57 GMT

Karimnagar: ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ కార్లా? నిలదీసిన సిఐటియు

కరీంనగర్: తెలంగాణ గీతా భవన్ చౌరస్తా వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ట్రావెల్స్ లలో ట్యాక్సీ కార్లు ఉపయోగించాలని ఐ టి యు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఇల్లీగల్ దందా వైట్ ప్లేట్ కార్ల దందా ప్రభుత్వం అరికట్టాలని అన్నారు. వైట్ ప్లేట్ కార్ల ద్వారా ట్రిప్పులు కరీంనగర్ టు హైదరాబాద్, వరంగల్ నిజామాబాద్, ఇతర జిల్లాలకు తిరుపతి ,షిరిడి యాత్రలకు వైట్ ప్లేట్ కార్ల ద్వారా కిరాయిలు తిప్పడం వల్ల ట్యాక్సీ క్యాబ్ ఓనర్స్ డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

వైట్ ప్లేట్ కార్ల వల్ల ఆర్టీసీకి, రవాణా శాఖకు భారీ నష్టం

వెంకటేశ్వర థియేటర్ బస్టాండ్ ముందు వైట్ ప్లేట్ కార్ల అడ్డాలు తొలగించాలని, ప్రభుత్వ శాఖలలో బినామీ డ్రైవర్ల పేర్లతో వైట్ ప్లేట్ కార్లు తిప్పుతున్నారు అట్టి కార్లను. కూడా వెంటనే తొలగించాలని కోరారు. ట్యాక్సీ కార్లు ఓనర్స్ తీవ్రంగా నష్టం జరుగుతుందని, కరీంనగర్ జిల్లాలో వైట్ ప్లేట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కిరాయిలకు ఇవ్వడం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ ద్వారా కూడా ట్యాక్సీ ఓనర్స్ & డ్రైవర్స్ నష్టపోతున్నారన్నారు. వైట్ ప్లేట్ కార్ల తో కిరాయిలకు తిప్పడం వల్ల రవాణా శాఖ కు ఆర్టీసీకి ఆదాయానికి భారీగా గండి పడుతుంది,

వైట్ ప్లేట్ కార్లపై రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలని, లేనియెడల రవాణా శాఖ కార్యాలయం ట్రావెల్స్ ముందు ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. నగరం అభివృద్ధిలో భాగంగా కళాభారతి ముందు ప్రజల అవసరాల రీత్యా టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు అవసరాల రీత్యా హైదరాబాద్ ఇతర జిల్లాలు తిరుపతి ,షిరిడి యాత్రలకు ట్యాక్సీ కార్లు ఉపయోగించాలని తెలిపారు. ట్యాక్సీ కార్లు ఉపయోగించడం వలన అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎంతమంది కస్టమర్ ఉన్న అందరికీ ప్రమాదం వర్తించదగిన గుర్తు చేశారు. 

వైట్ ప్లేట్ కార్ల లో ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ కు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో వంగల లక్ష్మారెడ్డి ,ఎల్దండి చందు, గుంటుకు శ్రావణ్ కుమార్ , నూనిగంటి రాజు , వీణవంక వరుణ్, మాతంగి రమేష్, మేకల శివకృష్ణ ,వంగల యాదిరెడ్డి ,నాచారం భాస్కర్ , అజయ్ ,గసికంటి అనిల్ , తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News