Vikarabad: రైతుల కోసం పోరాడితే అరెస్టులా? సర్కారుపై బీఆర్ఎస్ నేతల ఫైర్!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టు! మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనకు వెళ్లకుండా పోలీసుల నిర్బంధం.
Vikarabad: రైతుల కోసం పోరాడితే అరెస్టులా? సర్కారుపై బీఆర్ఎస్ నేతల ఫైర్!
వికారాబాద్ జిల్లా తాండూరు: రైతుల పక్షానా పోరాడటం బీఆర్ఎస్ పార్టీపై బాధ్యత ఉందని, వారికి అండగ ఉండేందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సర్కారు యత్నించడం దుర్మార్గమని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు.
పరిగిలో కాడ్లాపూర్ భూ నిర్వాసిత రైతులను పరామర్శించేందుకు వస్తున్న మాజీమంత్రి హరీష్ రావు పర్యటనకు వెళ్లకుండా మంగళవారం తాండూరులో బీఆర్ఎస్ నేతలను పట్టణ పోలీసులు నిర్బంధించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ జావిద్ తదితరులను పోలీసులు నిర్బంధించి పోలీస్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..
ప్రభుత్వం అక్రమంగా రైతుల భూములను లాక్కునేందుకు యత్నిస్తుంటే రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా నిలదీశారు. భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు భరోసా ఇవ్వడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధం దుర్మార్గమని అని విమర్శించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు .. కాంగ్రెస్ నేతలు భూములను దోచుకుంటున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.