Medak: కౌడిపల్లి గురుకులంలో సెగలు.. రోడ్డుపైకి చేరిన విద్యార్థుల ఆవేదన!

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో ఉద్రిక్తత! ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయుడు ఉదయ్ వేధింపులకు నిరసనగా విద్యార్థుల ధర్నా.

Update: 2026-04-07 07:11 GMT

Medak: కౌడిపల్లి గురుకులంలో సెగలు.. రోడ్డుపైకి చేరిన విద్యార్థుల ఆవేదన!

మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం లోని కౌడిపల్లి మండల కేంద్రం లో నున్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థుల రహదారిపై బైఠాయించి ధర్నా, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఫుడ్ మెనూ ప్రకారం పెట్టకుండా కులం పేరుతో దూషిస్తున్నారంటూ, ఉపాధ్యాయుడు ఉదయ్ వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ నిరసన ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ సైతం ఉపాధ్యాయుడు ఉదయికి మద్దతు పలుకుతున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, నేడు మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా.

వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులను తొలగించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగేంత వరకు రోడ్డుపై నుండి వెళ్ళమని భీష్ముంచుకు కూర్చున్నారు గత కొంతకాలంగా కొంతమందిని విద్యార్థులను టార్గెట్గా చేస్తూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెనూ సరిగా ఇవ్వడం లేదని అడిగినందుకు తమపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News