Tirupati: ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట!

Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీపతి బాబు పర్యటన! ఓజిలి మండలంలోని ఎస్సీ హాస్టళ్ల స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన.

Update: 2026-04-07 07:21 GMT

Tirupati: ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట!

తిరుపతి జిల్లా: నాయుడుపేటలో ని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తాసిల్దారులు డిఎస్ పి త సమావేశమైన రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీపతి బాబు, షెడ్యూల్ కులాల హాస్టల్స్ ను ఈరోజు ఓజిలి మండలంలో ని పలు హాస్టల్స్ ఉన్న పరిశీలించే విధంగా తను నాయుడుపేటకు విచ్చేసినట్టు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీపతి బాబు తెలియజేశారు, కూటమి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి చెంది ఎస్సీ కులాల కుటుంబాలు వారి పిల్లలు అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటుందని అందుకే ఎస్సీ కమిషన్ ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ స్థితిగతులను పరిస్థితులను పరిశీలించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ముఖ్యంగా షెడ్యూల్ కులాల విద్యార్థులు కు ఈ హాస్టల్ లో కనిపించే సదుపాయాలను మరియు సౌకర్యాలను పరిశీలించి వాటి అభివృద్ధికి దోహదపడే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలియజేశారు.

ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గం లో ఈ షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ హాస్టల్ పరిస్థితి కొన్ని ప్రాంతాలలో అధ్వానంగా ఉందని వాటి గురించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని ఇప్పుడు మిగిలిన హాస్టల్స్ ను పరిశీలించి వాటి స్థితిగతులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుందని షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ హాస్టల్ ల పురోగతిని సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన ఆయన తెలియజేశారు.

Tags:    

Similar News