అలిపిరి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్సా కేంద్రం

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు.

Update: 2025-12-28 10:31 GMT

తిరుమల: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు. శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు మెట్ల మార్గంలో వచ్చే సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే, తక్షణం వైద్య సేవలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

ఈ కేంద్రంలో టీటీడీ, అపోలో ఆస్పత్రి వైద్యులు, శిక్షణ పొందిన పారామెడికల్ బృందం భక్తులకు సేవలు అందిస్తారు. ఈసిజి యంత్రం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, నెబ్యులైజర్, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం, అనారోగ్య పరిస్థితులకి తక్షణ స్పందన, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఏర్పాటు ఈ కేంద్రంలో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News