Anantapur: హామీ నెరవేర్చిన చంద్రబాబు.. అనంతపురంలో చేనేత కులాల కృతజ్ఞతా సభ!
Anantapur: అనంతపురంలో చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ! ఎన్నికల హామీ మేరకు చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.
Anantapur: హామీ నెరవేర్చిన చంద్రబాబు.. అనంతపురంలో చేనేత కులాల కృతజ్ఞతా సభ!
Anantapur: చేనేతలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్తు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్జీవో హోం లో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతా సభలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను చేనేత కులాల ఐక్య వేదిక నాయకులు సన్మానించారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు మేర మగ్గాలకు 500 యూనిట్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రానున్న కాలంలో చేనేతల అభివృద్ధికి మరింత బాధ్యతగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.