MLC Surabhi Vanidevi: ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు కు ప్రమాదం

MLC Surabhi Vanidevi: ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది

Update: 2021-03-25 04:50 GMT

MLC Surabhi Vanidevi:(ఫైల్ ఇమేజ్)


MLC Surabhi Vanidevi: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం ఆమె శాసన మండలికి వస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్‌ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీకొట్టింది. ఈఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్‌మెన్‌ కారు నడిపినట్టు సమాచారం.

అసెంబ్లీ 8వ నెంబర్ గేట్ ను డీకొట్టి ప్రమాదానికి గురైంది. కారు టైర్ పేలి పెద్ద యెత్తున శబ్దం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంది. అయితే కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అతి వేగంగా పార్క్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎవరూ లేకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాణిదేవి ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు రావడం తెలిసిందే.

Tags:    

Similar News