MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇస్తాం
Women Reservation Bill: కేంద్ర ప్రభుత్వం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు.
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇస్తాం
Women Reservation Bill: కేంద్ర ప్రభుత్వం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు. లోక్ సభలో తాము పూర్తిగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెస్తున్నందుకు సంతోషంగా ఉందని కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇంతకుముందు పేర్కొన్న అంశాలే ఉన్నాయా? లేక పూర్తిగా మార్పులు చేసిన బిల్లును ప్రవేశపెడుతున్నారా? అని కవిత ప్రశ్నించారు. గతంలో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులోని అంశాలే ఇందులో కూడా ఉన్నాయా లేదా అనే దానిపై తమకు స్పష్టత కావాలని కోరారామె.