Miss World 2025: నేటి నుంచే మిస్ వరల్డ్ పోటీలు..షెడ్యూల్‌ ఇదే..!

Miss World 2025: తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తుంది.

Update: 2025-05-10 07:38 GMT

Miss World 2025: నేటి నుంచే మిస్ వరల్డ్ పోటీలు..షెడ్యూల్‌ ఇదే..!

Miss World 2025: తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తుంది. ఈరోజు ప్రారంభ వేడుక షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 22 రోజుల పాటు జరిగే ఈ అందాల పోటీల ప్రారంభ వేడుకలను గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరం తొలిసారి మిస్‌ వరల్డ్‌ పోటీలకు అతిథ్యమిస్తోంది. అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారని భావించగా.. ఇప్పటివరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. వారికి తెలంగాణ సంప్రదాయలతో విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్నా, పోటీదారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పొల్గొనేందుకు నగరానికి చేరుకోవటం విశేషం. ఇవాళ ప్రారంభమై ఈనెల 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీన హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే జరగనుంది.

రాష్ట్ర గీతాలాపనతో మిస్ వరల్డ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ గాయకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా దీన్ని ప్రత్యక్షంగా ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలంలో రూపొందిందిన సంప్రదాయ నృత్యరీతి పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. కళాకారులు అందరూ కలిసి తమ విన్యాసాలలో భాగంగా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్‌ వరల్డ్‌ లోగో ఆకృతులను ప్రదర్శిస్తారు.

ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. ఈ కళారూపాల అన్నింటి మేళవింపుతో ముగింపు కార్యక్రమం ఉంటుంది.

మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. పరేడ్‌ మైదానంలో జరిగే వేడుకల్లో కూడా పాల్గొంటారా, లేదా.. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆధ్వర్యంలో జరిగే ఎట్‌హోమ్‌ వరకే పరిమితమవుతారా అన్నది తేలియాల్సి ఉంది. మిస్‌ వరల్డ్‌ 71వ ఎడిషన్‌ (2024) ఫైనల్‌ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం.

Tags:    

Similar News