Thummala Nageswara Rao: మున్నేరు రిటైనింగ్‌వాల్, కేబుల్ బ్రిడ్జ్ పురోగతిపై మంత్రి తుమ్మల రివ్యూ
Thummala Nageswara Rao: మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జిలతో పాటు పలు అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Thummala Nageswara Rao: మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జిలతో పాటు పలు అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రిటైనింగ్ వాల్‌కు సంబంధించిన భూసేకరణ ఇంకా ఉందని.. దానిని కూడా పూర్తిచేయాలన్నారు మంత్రి తుమ్మల.
మళ్లీ వర్షాకాలం వచ్చే లోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెల నాటికి ఖమ్మం దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.