మంత్రి సీతక్క డ్యాన్స్.. వీడియో వైరల్

ములుగులో రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యువతీ యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు.

Update: 2025-01-25 11:34 GMT

నెలకు రూ.206 కోట్ల జీతమా..? ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?

Minister Sitakka Steps to Dj Tillu Song With Mulugu Students: ములుగులో రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యువతీ యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీత డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 3K రన్ ప్రారంభానికి ముందు సీతక్క డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేసి అక్కడున్న యువతీ, యువకుల్లో జోష్ నింపారు. మంత్రి సీతక్క డ్యాన్స్‌కు ఫిదా అయిన అక్కడ వారు చప్పట్లు, ఈలలతో అభినందించారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి సీతక్క.. విద్యార్థులు, యువకులతో కలిసి సరదాగా గడిపారు. ప్రస్తుతం సీతక్క డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కార్యక్రమం తర్వాత అధికారులతో మాట్లాడిన సీతక్క.. ప్రభుత్వ పథకాల అమలులో తప్పుచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సస్పెన్షన్‌తో పాటు సర్వీస్ నుంచి తొలగిస్తామని అన్నారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని.. స్కీముల అమలులో విచక్షణ, మానవత్వం మరవవద్దని చెప్పారు. మంచిర్యాలలో ఓ వృద్దురాలికి పింఛన్ ఆపడంపై ఫైర్ అయిన మంత్రి.. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం మీద రుద్దితే కఠిన చర్యలు తప్పవన్నారు. 

Tags:    

Similar News