Seethakka: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

Minister Seethakka review with officials of Rural Poverty Alleviation Organization
x

Seethakka: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

Highlights

Seethakka: బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై సమీక్షించిన మంత్రి సీతక్క

Seethakka: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ప్రస్తుతం అమలు అవుతున్న పథకాలు, బడ్జెట్‌లో కేటాయింపు ప్రతిపాధనలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులను వినియోగించుకోలేక పోయామని సీతక్క దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేస్తే... కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చన్నారు. పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాల జాబితా సమర్పించాలని అధికారులకు సీతక్క ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సీతక్క సూచించారు. మహిళా శక్తికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తామని... అందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories